మొదటి కర్ణాటక యుద్ధంలా, ఐరోపాలోని సప్తవర్ష సంగ్రామ యుద్ధం వల్ల భారతదేశంలోని ఆంగ్లేయులు, ఫ్రెంచి వారిమధ్య మూడో కర్ణాటక యుద్ధం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ ప్రాబల్యాన్ని తుదముట్టించేందుకు, రాబర్ట్ క్లైవును ఎదుర్కోవడానికి ఫ్రెంచివారు కౌంట్-డి-లాలీని గవర్నర్గా నియమించారు. ఈయనకు సహాయంగా హైదరాబాదు నుంచి ఫ్రెంచి సేనాని జనరల్ బుస్సీని పిలిపించారు. వాంది వాశి యుద్ధం (1760) క్రీ.శ. 1760 లో బ్రిటిష్ సేనాని 'సర్ఐర్కూట్', ఫ్రెంచి వారైన జనరల్ బుస్సీ, కౌంట్-డి-లాలీని ఓడించారు. వాంది వాశి యుద్ధంలో ఫ్రెంచివారు ఓడిపోవడంతో భారతదేశంలో వారి ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. ప్యారిస్ సంధి (1763) 1763 లో ప్యారిస్ సంధి ద్వారా 'సప్తవర్ష సంగ్రామం' ఐరోపాలో ముగియగా, భారతదేశంలో మూడో కర్ణాటక యుద్ధం ముగిసింది. పై మూడు కర్ణాటక యుద్ధాల ఫలితంగా ఫ్రెంచివారు కేవలం వర్తకానికి మాత్రమే పరిమితం అయ్యారు. బ్రిటిష్ ప్రాబల్యం విస్తరించింది.
ఏ సంధి వలన భారత దేశం లో మూడవ కర్ణాటక యుద్దం ముగిసింది?
Ground Truth Answers: ప్యారిస్ప్యారిస్ప్యారిస్
Prediction: